10 నుంచి పీజీఈసెట్ పరీక్షలు
09-06-2024 02:17 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఈ నెల 10 నుంచి 13 వరకు పీజీఈసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. సీబీటీ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఎంఈ, ఎంటెట్, ఎంఫార్మా, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో 2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను కల్పించను న్నారు. పరీక్ష నిర్వహణకు హైదరాబాద్, వరంగల్ రీజియన్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ ఏ అరుణకుమారి తెలిపారు. మొత్తం 22,712 పరీక్షా కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయగా హై దరాబాద్ పరిధిలో 18,300, వరంగల్ పరిధిలో 4,412 పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయానికంటే ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.






