నీట్ అవకతవకలపై విచారణ చేపట్టాలి
09-06-2024 02:16 AM
విద్యార్థి సంఘాలు డిమాండ్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): నీట్ అవకతవకలపై సమగ్ర విచారణను జరిపించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని ఆయా సంఘాలు వేర్వేగా శనివారం ప్రకటనలు విడుదల చేశాయి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన సమ యంలో నీట్ పరీక్ష ఫలితాలను ప్రకటించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. ముందుగా జూన్ 14న అని ప్రకటించి, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలను వెల్లడించడంపై దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నాయి. నీట్ ఫలితాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.






