సీసీ కెమెరాల్లో వయనాడ్ విలయం..
తిరువనంతపురం, ఆగస్టు 18: మృత్యుశకలాల్లా విరుచుకుపడుతు న్న కొండచరియలు.. అవి కాంక్రీట్ గోడలను ఢీకొడుతుండగా పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. వరద ఉధృతికి దూసుకువస్తున్న బండరాళ్లు.. నిస్సహాయ స్థితిలో కొట్టుకు పోతున్న జీవాలు.. ప్రవాహంలో తెప్పల్లా కదులుతూ వెళ్తున్న మృతదేహాలు.. అమ్మో.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుతుంది కదా..! గత నెల చివరిలో వయనాడ్‌లో సంభవించిన జలవిలయంలో సీసీ కెమె రాలకు చిక్కిన దృశ్యాలివి ! తాజాగా ఈ ఫుటేజీనీ మలయాళ మీడియా విస్తృతంగా ప్రసారం చేస్తున్నది.
ప్రకృతి వైపరీత్యంలో ఒక్క వయనాడ్ జిల్లాలోనే 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కావా ల్సి ఉన్నది. జిల్లాలో ఇప్పటికీ వరద బాధితుల కోసం పునరావస కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వర దల ధాటికి వెల్లర్మల, ముండక్కై ప్ర భుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతినగా.. రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం..
రాష్ట్రప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కొండ చరియలు విరిగిపడి 36 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ప్రకృతివైపరీత్యం కారణంగా నష్టపోయి న 12 కుటుంబాలకు ఎస్డీఆర్‌ఎఫ్, సీఎండీఆర్‌ఎఫ్ నుంచి రూ.72 లక్షల సాయం అందింది. జీవనోపాధి కోల్పోయిన 617 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున అందింది.




