calender_icon.png 8 August, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠాకూర్ రవీందర్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటు

08-08-2025 01:28:09 AM

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

వరంగల్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ గారు అనారోగ్య కారణం వల్ల మృతి చెందిన విషయం తెలిసి వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్,

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. వారి వెంట రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కూనమళ్ల పృథ్వీరాజ్, వనపర్తి మల్లయ్య, శీలం సత్యనారాయణ, పొదిళ్ల రామచందర్, రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,

యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, యువ మోర్చా నాయకులు జూలూరి మనీష్ గౌడ్, కుంభం కోమల్ రెడ్డి, బానోత్ రమేష్, పట్టణ కమిటీ సభ్యులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, కాసుల నాగేంద్రబాబు, వరంగంటి రాజకుమార్, తప్పేట్ల సతీష్, చిలువేరు అన్వేష్ పాల్గొన్నారు.