calender_icon.png 8 August, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలి

08-08-2025 01:28:41 AM

కలెక్టర్ హైమావతి

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 7 : స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వాతంత్ర దిన  వేడుకల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసారి వేడుకలను  పోలీస్ కమిషనరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి కనపడేలా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన, స్టాళ్ళ ఏర్పాటు చేయాలని, ముఖ్య అతిథి ప్రసంగం సిద్ధం చేయాలని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో  జిల్లా అధికారులు, సిద్దిపేట డీఎస్పీ రవీందర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో పాల్గొన్నారు.