4 May, 2026 | 3:41 AM

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

04-05-2026 02:34 AM

తాడ్వాయి, మే, 3( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం గ్రామానికి చెందిన మెట్టు యాదవ్వ కుమార్తె ప్రియాంకకు పుస్తె మట్టెలను స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  తాడ్వాయి మండల కేంద్రంలోని ఓ ఆడబిడ్డ తల్లికి పెళ్లి చేసేంత ఆర్థిక స్తోమత లేదని కుమార్తె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని ఆమెకు ఏదైనా సహాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను కోరగా ఆయన వెంటనే స్పందించాలని తెలిపారు.

దీంతో ఆయన పేదింటి ఆడబిడ్డ కు పుస్తె మట్టెలు పంపించారని తెలిపారు. వీటిని తల్లి యాదవ్వ, ఆమె కుమార్తె ప్రియాంకకు అందించినట్లు వారు వివరించారు.పెద్ద మనసున్న మహానాయకుడు మాజీ ఎమ్మెల్యే సురేందర్ అని వారు తెలిపారు.ఎవరైనా పేదవారు ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా వెంటనే సురేందర్ స్పందిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ వైస్ ఎంపీపీ అయిన ముదాం నర్సింలు, సర్పంచులు మెట్టు విజయ రాములు, మంగారెడ్డి, నర్సింలు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.