పక్క రాష్ట్రాల నుండి జిల్లాలోని ఏజెన్సీకి చేరుతున్న జొన్న పంట
- ఇప్పటికే రెండు మండలాల్లో అక్రమ నిల్వలు..
- ఆంధ్ర ప్రదేశ్ నుండి ఏజెన్సీకి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు
ఉట్నూర్, మే 3 (విజయక్రాంతి): రైతులు రబీ సీజన్ లో సాగు చేసిన జొన్న పంటలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన జొన్న పంటలను క్వింటాల్ కు రూ. 3,740 చొప్పున కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని గుర్తించింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు పక్క రాష్ట్రాల్లో సాగు చేస్తున్న జొన్న పంటలను అక్కడ రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఏజెన్సీ ప్రాంతానికి జొన్న పంట లు దిగుమతి చేస్తున్నారు.
పక్క రాష్ట్రాల్లోని మార్కెట్ యార్డు నుండి పంట రవాణాకు అనుమతి పత్రాలు తీసుకొని ఏజెన్సీ ప్రాంతలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ తదితర మండలాల వ్యాపారులు ఇక్కడి రై తుల పేరుతో ప్రభుత్వ మద్దతు ధరకు జొన్న పంటలు నిల్వ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్వింటాల్ జొన్న పంటకు రూ.2,300 నుం చి 2,600 చెల్లించి కొనుగోలు చేసుకొని ఇక్కడికి లారీల్లో తరలిస్తున్నారు.
పక్క రాష్ట్రా ల నుంచి తరలించిన జొన్న పంటను తెలిసిన రైతుల ఇంట్లో నిలువలు చేసుకుని రైతు పేరుతోనే మార్కెట్ యార్డులో ప్రభుత్వం మద్దతు ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ని గిరిజన గ్రామాల్లో దాదాపుగా పదివేల క్వింటాళ్లపైన జొన్న పం టలను నిల్వ చేసినట్లు సమాచారం.
గిరిజన గ్రామాల్లో చేసిన నిలువలపై నిఘాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే అక్ర మ జొన్నల నిల్వలు బయటపడతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జొన్న పంటల నిల్వలపై క్షేత్రస్థాయి విచారణ జరిపిన రైతులు కోరుతున్నారు.
ఆంధ్ర... మహారాష్ట్ర నుండి తెలంగాణకు జొన్నలు..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో రబీ పం టలుగా సాగు చేసే జొన్న పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో వ్యాపారులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు సాగు చేసిన జొన్న పంటలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి ప్రాంతంలో అక్కడి రైతులు సాగు చేసిన జొన్న పంటను అక్కడి దళారులతో ఈ ప్రాంత వ్యాపారులు కొమ్మక్కై జొన్న పంటను లారీలో తీసుకువస్తుండగా ఇంద్రవెల్లి పోలీసులు ఏపీ- 39 యు.యు 5579 లారీని పోలీసులు పట్టుకున్నారు.
దాదాపు 400 క్వింటాళ్ల జొన్న పంటతో వచ్చిన లారీని వాహనాల తనిఖీలలో గుర్తించారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ మడవి ప్రసాద్ ’విజయక్రాంతి’ వివరణ కోరగా.. ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన జొన్న పంట వారిని అదుపులో తీసుకున్నామన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.






