6 July, 2026 | 4:30 AM

ఆ సంభాషణ రికార్డ్ చేయలేదు

21-05-2024 12:34 AM

న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడం వారి గోప్యతకు భంగం కలిగించేలా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఖండించింది. తాము ఎవరి మాటలను రికార్డు చేయలేదని కేవలం దృశ్యాలను మాత్రమే ప్రసారం చేశామని పేర్కొంది. ‘మే 16న వాంఖడే స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్ సమయంలో రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒక బ్రాడ్‌కాస్టర్‌గా మాత్రమే చూపించాం.

అంతేకానీ వాళ్లు మాట్లాడేటప్పుడు ఆడియోను రికార్డు లేదా ప్రసారం చేయలేదు. రోహిత్ శర్మ తన సంభాషణ ఆడియోను రికార్డ్ చేయవద్దని కోరిన క్లిప్ మాత్రమే స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కవరేజీలో చూపించాం. ప్రసారాల విషయంలో ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగించకూడదన్న నిర్ణయానికి కట్టుబడే ఉన్నాం’ అని స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. కోల్‌కతా, ముంబై మ్యాచ్ సందర్భంగా అభిషేక్ నాయర్‌తో రోహిత్ ముచ్చటించిన విషయాలను స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేసింది.