2 September, 2026 | 8:17 AM

బోపన్నకు జోడీ ఎవరు?

21-05-2024 | 12:35am

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్నకు జోడీగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రీలలో ఎవరో ఒకరిని బోపన్న తనకు జోడీగా ఎంపిక చేసుకునే అవకాశముంది. సెలక్షన్ కమిటీ ఈ విషయంలో ఒక నిర్ణ యానికి వచ్చినప్పటికీ అంతిమంగా తన జోడీని నిర్ణయించుకునే హక్కు బోపన్నదే అని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) పేర్కొంది.