16 April, 2026 | 3:50 AM

ఎన్నారై ప్రొడ్యూసర్ అంటే ఇండస్ట్రీలో ఆ అభిప్రాయమే ఉంది!

16-04-2026 02:18 AM

నాగశౌర్య హీరోగా రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కు తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిలమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత శ్రీనివాస రావు విలేకరు లతో పంచుకున్నారు. “ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. శౌర్యను ఇప్పటివరకు లవర్ బాయ్ క్యారెక్టర్లలోనే చూశారు.

ఇందులో పూర్తిగా యాక్షన్ టోన్‌తో చూస్తారు. దాదాపు 400కి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం.  సినిమా తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందీ సినిమా. -ఎన్నారైలు అంటే ఒక సినిమా చేసి వెళ్తారనే అభిప్రాయం ఉంటుంది.

కానీ నా వరకు నేను ఏ విషయం అయినా ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటా. సినిమా నిర్మాణంలో అన్ని విషయాలు తెలుసు కున్నాం. నాకు సినిమాలంటే చాలా పాషన్. మేము రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాం. జూన్‌లో ఒక సినిమా ప్రారంభం కాబోతోంది. ఇంకో సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది. చిన్న, మీడియం సినిమాలు చర్చలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాం” అని చెప్పారు.