టెన్త్ ఫలితాల్లో పారమిత విద్యార్థుల సత్తా
ముకరంపుర, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో కరీంనగర్‌లోని పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎప్పటిలా అత్యున్నత ఫలితాలు సాధించారు. పారమిత విద్యా సంస్థ స్థాపించి 30సంవత్సరాలైన సందర్భంగా ఈ అత్యుత్తమ ఫలితాలు యాజ మాన్యానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆనందాన్నిచ్చిం ది.
అని ఈ ఫలితాలు పారమిత ఒకే ఒక స్టేట్ బోర్డు బ్రాంచ్‌కు సంబంధించినవి.పారమిత స్థాపించిన మొదటి నుంచి ప్రతి విద్యార్థి ప్రతిభను మెరుగుదిద్దడం అన్నది పాఠశాల సిద్ధాం తం 2025--26 పదవ తరగతి ఫలితాలు దీనికి అద్దం పడుతున్నా యి. ఈ ఫలితాలలో రాచమల్ల ఆధ్య 583 మా ర్కులు, రామక కార్తికేయ 583 మార్కులు, గట్టు సంప్రీతి 582 మార్కులు సాధించగా 84 మంది విద్యార్థులు 90% పైగా, 173 మంది విద్యార్థులు 80% పైగా, 198 మంది విద్యార్థులు 70% పైగా, 99 శాతం విద్యార్థులు 60% పైగా సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ డా: ఇనుగంటి ప్రసాదరావు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార మిత విధ్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, వినోదరావు, రాకేశ్, వీయూ ఎం ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత విద్యార్థు లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






