17 April, 2026 | 9:32 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

జయరాంరెడ్డి లేని లోటు పార్టీకి తీరని లోటు

05-06-2025 12:11 AM

- హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి):  బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జయరాం రెడ్డి లేని లోటు పార్టీకి తీరనిలోటని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, అడిక్ మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్గీయ జైరామ్ రెడ్డి  జయంతిని బుధవారం అడిక్మెట్లో మాజీ కార్పొరేటర్ హేమలత ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. 

సందర్బంగా  ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకార్థం పేదలకు టిఫిన్ బాక్సులను   అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిక్ మెట్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు బల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నేత శ్రీనివాస్, జెల్ల భిక్షపతి, మేడి సత్యనారాయణ, రాజు, అబ్బు, రింకు,  జ్ఞాని, సాయి గౌడ్, ధర్మ, లక్ష్మిపతి, టైలర్ శ్రీను, నగేష్, నాగరాజు, అస్లాం, మున్ను, అసిఫ్, ప్రేమ లతా రెడ్డి, విజయ, శైలజ తదితరులు పాల్గొన్నారు.