17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రతి ఫిర్యాదును స్వీకరించి భూభారతిలో పరిష్కరిస్తాం

05-06-2025 12:12 AM

కలెక్టర్ హనుమంతరావు

వలిగొండ,జూన్ 4 (విజయక్రాంతి): రైతుల ప్రతి ఫిర్యాదును స్వీకరించి భూభారతిలో పరిష్కరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు సంబంధించిన ఎన్నో భూ సమస్యలు కొన్ని ఏండ్లుగా ఆపరిష్కృతంగా మిగిలిపోయాయని భూభారతి ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు.

రైతుల భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో రెవెన్యూ సిబ్బంది స్వీకరించడం జరుగుతుందని వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎంఆర్‌ఐ కరుణాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, రెవిన్యూ సిబ్బంది,, రైతులు పాల్గొన్నారు.