30 May, 2026 | 9:19 PM

Breaking News

పొగాకుకు దూరంగా ఉండండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి   •   నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు   •   ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •  

నిందితులను శిక్షించాలి

24-02-2026 12:55 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కుమ్మెరలో రజక కుటుంబం జరిగి న దాడి అమానుషమని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చిన్నారి మృతి ఘటనకు కారకులైన శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి, సతీష్‌రెడ్డిల ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ..

రజక కులస్తులపై అగ్రకుల వర్గాలు కర్కశంగా దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బీసీలపై దాడులను అరికట్టడానికి సీఎం చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. బీసీలపై జరుగుతు న్న దాడులను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకో లు నిర్వహించాలని ఆయన బీసీ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.