నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు
30-05-2026 09:17 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావ్, ఎస్సై చంద్రకుమార్ లు అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి నేరాలు, సైబర్ నేరాల తోపాటు ఏ లాంటి నేరాలకు పాల్పడిన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను, ఆరు నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనపరుచుకున్నారు, ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.






