30 May, 2026 | 9:14 PM

Breaking News

ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి   •   ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం   •   సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం   •  

ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి

30-05-2026 09:14 PM

ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతుల ఖాతాలో త్వరగా డబ్బులు వచ్చే విధంగా కృషి చేయాలని ఐకెపి సిబ్బందికి ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు సూచించారు.ఈ సందర్భంగా ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు ట్యాబ్ ఎంట్రీ స్థితిగతులను తెలుసుకొన్నారు.శనివారం మండలంలోని వదల్ పర్తి, చీనూరు, ధర్మారెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని తూకం వేసిన బస్తాల అధికంగా ఉన్న సెంటర్లలో లారీలు అదనంగా సమకూర్చాలని సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడటం జరిగింది.వర్షాకాలం సమీపిస్తున్నందున వరి ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు పూర్తిస్థాయిలో కప్పి ఉంచాలని ఆయన సిబ్బందికి పలు సూచనలు తెలియడం జరిగింది.ఆయన వెంట మండల ఎపిఎం రామ్ నారాయణ గౌడ్,సీసీలు దత్తు,రమేష్,రవి తదితరులు పాల్గొన్నారు.