05-02-2026 01:02:32 AM
డిఫెన్స్ రంగంలో 30 మంది ఉద్యోగాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తేజస్ సంస్థ నుంచి 30 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించారు. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌ఆర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరందరూ ఫిబ్రవరి నెల శిక్షణ కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. 15 మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ జీడీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వరుసగ తేజస్ నుంచి విద్యార్థులు ప్రతిభకనబర్చి ఉద్యోగాలు సాదిస్తునందుకు తమకు సంతోషంగా ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. 2026 విద్యాసంవత్సరం నుంచి మహిళలకు కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఐఐటీ, జేఈఈ, నీట్‌లో కూడా విద్యార్థులు ర్యాంకులు సాదించాలన్నారు. శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు.