కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం
సత్తుపల్లి,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల పన్ను రాయితీలు, భూములు, సబ్సిడీలు ఇస్తూ సామాన్య ప్రజలపై మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల రూపంలో భారాలు మోపడం దారుణమని సిపిఎం సత్తుపల్లి కమిటీ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మొరంపొడి పాండురంగారావు విమర్శించారు.
దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల చేతుల్లో కేంద్రీకరించే విధానాలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవైపు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రుణమాఫీలు చేయడం ప్రజా వ్యతిరేక విధానమని పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలను వెంటనే తగ్గించాలని అదేవిధంగా లేదా పేద మధ్యతరగతి, అంబాల పిల్లలు చదువుకునే రోజు నుండి చదువు కొనుక్కునే రోజులుగా మార్చారని స్కూల్ ఫీజులు నియంత్రణ చేసి కార్పొరేట్ దోపిడీలు నుండి విద్యార్థులను తల్లిదండ్రులు కాపాడాలని అన్నారు అదేవిధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉపశమన చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేసింది.
ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి కార్పొరేట్ల లాభాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సిపిఎం హెచ్చరించింది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామని సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు సిపిఎం నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, గుదే రాము ,చప్పిడి భాస్కర్,నాయకులు తెలిపారు






