24 June, 2026 | 1:16 AM

ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం

24-06-2026 12:42 AM

మలక్‌పేట్, జూన్ 23 (విజయక్రాంతి): మలక్‌పేట్ నియోజకవర్గం సైదాబాద్ మదన్నపేట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ను మంగళవారం గౌరవ మలక్పేట్ ఎమ్మెల్యే  అహ్మద్ బలలా , జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్  కన్నం సత్యనారాయణ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తక్కు వ ధరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం ఓల్ మలక్పేట్ కమ్యూ నిటీ హాల్లో నిర్వహించిన ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్  బలలా, జోనల్ కమిషనర్ సత్యనారాయణతో కలసి ప్రారoభించి  అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలలా మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

నిరుపేదలు రోజువారి కూలీ పనులు చేసుకునే కార్మికులకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంతో సౌకర్యంగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ చీరలకు పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కాంటీన్లను జోన్ పరిధిలోని 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నా రు. పేదలకు రోజువారి కూలీలకు సౌకర్యం గా ఉండేందుకు ప్రధాన చౌరస్తాల ప్రాంతా లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇం దిరా మహిళా శక్తి చీరలను స్వయం సహాయక సంఘాల సభ్యుల సమన్వయంతో పంపిణీ కొనసాగు తుందన్నారు. అరులైన లబ్ధిదారులకు చీరలు అందించేందుకు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో మలక్ పేట్, ముసారం బాగ్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ఇంకేశఫ్ అలీ, మంగా తయారు, యూసీడిడిపీఒలు, క మ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, రిసోర్స్ పర్సన్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.