calender_icon.png 9 February, 2026 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది రాజకీయ నాటకం

09-02-2026 01:25:24 AM

  1. కేంద్ర నిధులతో కార్పొరేషన్‌ల అభివృద్ధి
  2. మున్సిపోల్స్‌లో అత్యధిక స్థానాలు గెలుస్తాం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  4. కొత్తగూడెం, కోదాడలో ఎన్నికల ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం/కోదాడ, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పా ర్టీలు బహిరంగంగా బద్ధశత్రువులాగా వ్యవహరిస్తున్నప్పటికీ, లోపల పరస్పర సహ కారంతో రాజకీయ నాటకం సాగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వు తీవ్రంగా విమర్శించారు. తమ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోనందుకే బీజే పీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కాపాడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాం లో చేసిన అవినీతి, అక్రమాల నాయకులను కాపాడేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రా ష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని, అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, మరోవైపు బీఆ ర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కా ంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్‌ఎస్ రెండు కూడా అవినీతి పార్టీ లేనాని   ఆయన విమర్శించారు.  యువత మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలను వంచిస్తున్న పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి  అని  పిలుపునిచ్చారు.

ఈ దుస్థితి మారాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని వ్యాఖ్యానించారు. తన సొంత ప్రాంతమైన కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కోదాడలో లాకప్ డెత్‌లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. 

‘ఫోన్ ట్యాపింగ్’పై అనుమానాలు

ఫోన్ టాపింగ్ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు రాలేదని రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ విచారణ పేరుతో ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే నానుస్తుందని ఆరోపించారు. ఫోరెనిక్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి జరి గిందేమోనని అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయని ఆరోపించా రు. ఈ కేసులో అనేకమంది బీజేపీ నాయకుల ఫోన్లు టాప్ చేయడంతో పాటు తప్పు డు కేసులు పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.