calender_icon.png 9 February, 2026 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు గ్రామాలు అభివృద్ధి చేస్తా

09-02-2026 01:23:44 AM

జిన్నారం 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మల్లేష్ ముదిరాజ్ 

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 8: పదవి అనుభవించాలని ఉద్దేశంతో రాలేదని.. పదవులు శ్వాశతం కాదని.. మాదారం, దువ్వగుంట, మంత్రికుంట గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా స్వత్రంత్ర అభ్యర్థిగా ముం దుకు వస్తున్నానని, అందరూ ఆశీర్వదించి ఆపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జిన్నారం 11వ వార్డు స్వత్రంత్ర కౌన్సిలర్ అభ్యర్థి పెండల మల్లేష్ ముదిరాజ్  వార్డు ప్రజలను కోరారు. ఆదివారం 11వ వార్డులో ప్రజలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

వార్డులో పర్యటిస్తున్న సమయంలో వార్డులోని ప్రజలంతా ముక్త కంఠంతో మేమంతా మీవెంటే ఉన్నామని చెపుతున్నారని అన్నారు. మూడు గ్రామాలలోని ప్రతి ఒక్కరు నా కుటుంబసభ్యులని, వారి అభివృద్ధి కోసం అనుక్షణం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. సమస్యలు తెలిసిన వ్యక్తిగా వాటిని ఏ విధంగా పరిష్కరించాలో, ప్రభుత్వంతో, అధికారులతో ఎలా పని చేయించుకోవాలో తనకు తెలుసునన్నారు.

11వ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే మూడు గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తా, బ్యాలెట్‌లో ఆపిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎండల మల్లేష్ ముదిరాజ్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆది ఎల్లయ్య, లింగం, రామకృష్ణ, వెంకటేష్, జగన్, కుమార్, దేవేందర్, దశరథ్, బజరంగ్ సింగ్, గణేష్ శేఖర్, రాజు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.