17 July, 2026 | 9:12 PM

ఉద్యమకారులను గుర్తించాలి..

02-06-2024 02:52 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగేండ్లు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలకులు ఉద్యమకారులను గుర్తించలేదు. ఉద్యమాన్ని ముందు కు తీసుకెళ్తున్న క్రమంలో రెండుసార్లు జైలుకు వెళ్లా. ఒకసారి 31 రోజులు జైల్లోనే ఉన్నా. 37 సార్లు నన్ను బైండోవర్ చేశారు. ఇంతచేసినా మాలాంటి ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వచ్చింది. కాం గ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. ప్రతి మండలంలో ఎందరో ఉద్యమకారులు ఉన్నారు. వారిని గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలి. ఉద్యమకారులను గౌరవిస్తేనే తెలంగాణ సాధించుకున్న దానికి ప్రతిఫలం దక్కినట్లవుతుంది. 

 ఎండీ ఇంతియాజ్ బేగ్, తెలంగాణ ఉద్యమకారుడు, మహాముత్తారం, జయశంకర్ భూపాలపల్లి