calender_icon.png 7 February, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలి

07-02-2026 12:45:05 AM

ఎంపీడీవో భీమా జయశీల 

బోయినపల్లి: ఫిబ్రవరి 6(విజయక్రాంతి): విద్యార్థులు యువకులు క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించాలని అదేవిధంగా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఎంపీడీవో భీమా జయశీల కోరారు. సీఎం కప్ క్రీడలలో బోయినపల్లి మండలం వాలీబాల్ కబ డ్డీ ఆటల పోటీలలో నియోజకవర్గస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి సీఎం కప్ గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లో ఈ రెండు జట్లకు సీఎం కప్ అందించగా ఎంపీడీవో బీమా జయ శీల అభినందించి ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ యువకులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొంటూ తన ప్రతిభను కనబరచాలని కోరారు. క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులకు యువకులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రవణ్ కుమార్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతోపాటు మండలములోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలను, పీడీలను కూడా అభినందించారు.