28-10-2025 12:34:26 AM
మందమర్రి, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో అవినీతి నిర్మూలనే లక్ష్యం గా విజిలెన్స్ విభాగం పనిచేస్తుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. ఏరియా జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారో త్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలతో పాటు, సింగరేణి లో ఈ నెల 27 నుండి నవంబర్ 2 వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సింగరేణిలోని అన్ని గనులు డిపార్ట్మెంట్‌లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.సింగరేణి సంస్థలో అవినీతికి వ్యతి రేకంగా విజిలెన్స్ విభాగం పనిచేస్తుందన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ చైతన్య పరిచి అవినీతి నిర్మూలనలో భాగస్వాము లను చేయటమే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తిస్తే వెంటనే విజిలెన్స్ అధికారు లకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు దారుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచ బడతాయన్నారు,
దేశ ప్రగతికి అవరోధం అయిన అవినీతిని నిరోధించు బాధ్యత ప్రతి ఉద్యోగి తీసుకోవాలని కోరారు. వారోత్సవాలలో భాగంగా సిం గరేణి ఉద్యోగుల కు,అధికారులకు వ్యాసరచ న పోటీలు, సింగరేణి పాఠశాల విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరుగు తుందన్నారు. అనంతరం కార్యాలయం ఉద్యోగులతో విజిలెన్స్ ‘సమగ్రత ప్రతిజ్ఞ‘ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, సీనియర్ పీఓ సత్యనారాయణ, జిఎం ఆఫీస్ హెచ్‌ఓడిలు, అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.