28-10-2025 12:35:12 AM
రామాయంపేట, అక్టోబర్ 27 :రామాయంపేట పోలీస్ స్టేషన్ లో పోలీసు అమ రవీరుల వారోత్సవాలలో భాగంగా సోమవారం లయన్స్ క్లబ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంక టరాజా గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం మహాదానమని, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం ప్రాణదానం అవుతుందని, పోలీసు అమరవీరుల స్మరణలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం అన్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్త్స్ర బాల రాజ్, నిజాంపేట ఎస్త్స్ర రాజేష్, నార్సింగ్ ఎస్త్స్ర సృజన, పోలీస్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.