28-10-2025 12:33:23 AM
జహీరాబాద్ టౌన్, అక్టోబరు 27 :సమాజంలో సత్ప్రవర్తన కలిగి మంచి నడవడిక నే ర్చుకున్న నాడే సమాజం గుర్తింపునిస్తుందని జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర వినయ్ కుమార్ అన్నారు. సోమవారం జహీరాబాద్, పట్టణంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిం చి సత్ ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడినా వారిపై చట్టరీత్యా తగు చ ర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది రౌడీ షీటర్లకు వివిధ నేరాలు చేసిన వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో ఎస్.ఐ సంగమేశ్వర్, నర్సింలు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.