వావ్ అనిపిస్తున్న ‘యానిమల్ ఆరాధ్య’ ఫొటో సిరీస్
‘యానిమల్ ఆరాధ్య’ పేరుతో రాష్ట్ర రాజధానిలో ఏర్పాటుచేసిన ఫొటో సిరీస్‌ను చూసిన ప్రకృతి ప్రేమికులు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆవిష్కృతమైన ఈ చిత్తరువుల సోయగాలు ప్రకృతి ఆరాధకులను చూపు తిప్పుకోలేకుండా కట్టి పడేశాయంటే అతిశయోక్తి కాదు! ప్రముఖ స్టిల్స్ ఫొటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే! ఆ చిత్ర హీరోయిన్ ఆరాధ్యదేవితో నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ టైటిల్‌తో ఫొటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేశాడు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్‌గోపాల్ వర్మ హాజరై ఫొటో సిరీస్‌ను ఆవిష్కరించారు.
ఈ ఫోటో సిరీస్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్రలో ఇంత వినూత్న తరహాలో ఫొటోలను తీసింది లేదు. అందువల్ల ఇది సమ్‌థింగ్ స్పెషల్ ఫొటో సీరిస్ అని ఫొటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేరిజన్‌తో సరికొత్త క్రియేటివిటీతో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫొటో సీరిస్‌గా రూపొందించారు. ఈ వైల్డ్ ఫొటోల్లో ఆరాధ్యను అడవి జంతువులైన మాకావు, ఇగువానా, కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్, హొరేస్ గుర్రంతో కలిసి కళ్యాణ్ ఈ చిత్రాలను తన కెమెరాలో బంధించారు. ఈ ఫొటో షూట్‌కు ప్రణతివర్మ కాస్టుమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫొటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికి ప్రతీకగా ఉన్నాయి.












