27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పాఠశాలలను కుదిస్తామన్న ప్రకటనను వెనక్కి తీసుకోవాలి

11-06-2026 12:38 AM

తుగ్లక్ పాలనను తలపిస్తున్న రేవంత్ నిర్ణయాలు

భీమదేవరపల్లి, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ అధ్వానంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచే విధానాలను అవలంబించడం ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మండల సురేందర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల శాఖ అధ్యక్షులు మండల సురేందర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 27 వేల వరకు ఉండగా వాటిని రాష్ట్ర ప్రభుత్వం 4000 వరకు కుదిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు ప్ర భుత్వ విద్యను అభివృద్ధి చేస్తామని చెబు తూ, మరోవైపు రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రయత్నాలు చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయ స్సు గల ప్రతి బాలబాలికకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని గుర్తుచేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి అందుబాటు లో విద్యా సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా, పాఠశాలల విలీనం లేదా కుదింపు కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.