calender_icon.png 5 July, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను నెరవేర్చాలి

05-07-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూలై 4(విజయక్రాంతి): సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లు కలిసి దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజం నవాబుల పరిపాలనలో పెట్టి చాకిరి,బానిసత్వం కొనసాగుతున్న తరుణంలో గ్రామాల్లో దేశ్ ముఖ్ ల ఆగడాలు పెరిగిపోయి ప్రజలను పట్టీ పీడిస్తున్న నిజాం నవాబు,రజాకార్ లను ఎదిరించడానికి ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్టు పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో కడివెండి గ్రామంలో విసునూరు.

దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో 1946 జూలై 4వ తేదీన దొడ్డి కొమురయ్య పై కాల్పులు జరపడంతో నెలకొరిగారని,తొలి అమరవీరుడు గా చరిత్ర పుటల్లో ఉన్నాడని,ఆయన స్పూర్తితో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి,

జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,అందె స్వామి,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,టేకుమల్ల సమ్మయ్య,బత్తుల బాబు,గూడెం లక్ష్మీ,నాగెల్లి లక్ష్మారెడ్డి,పిట్టల సమ్మయ్య,కిన్నెర మల్లవ్వ లతో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రజా సంఘాల నాయకులుపాల్గొన్నారు.