19 March, 2026 | 1:07 AM

ప్రేక్షకుడు భాస్కర్ పాత్రలో తనను చూసుకుంటాడు

31-10-2024 12:00 AM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.  వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు.

‘-‘విడుదలకు ముందే ‘లక్కీ భాస్కర్’పై ఈస్థాయి అంచనాలు ఏర్పడటం సంతోషంగా ఉంది. మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. సగటు ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివితేటలతోనే ఎదుగుతాడు” అని తెలిపారు.