12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ముహూర్తం ఫిక్స్

18-12-2025 12:19 AM

22న సర్పంచుల ప్రమాణ స్వీకారం 

నకిరేకల్, డిసెంబర్ 17 :  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ముందుగా ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం నిర్వహించాలని నిర్ణయించగా, ఆ రోజు సరైన ముహూర్తాలు లేకపోవడంతో తేదీ మార్పు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ, ‘అపాయింటెడ్ డే’ను డిసెంబర్ 22వ తేదీకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ ఒకే రోజున పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామ పరిపాలన మొదలుకానున్నది.