18-12-2025 12:22:19 AM
పలు గ్రామాలలో ఎన్నికలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సూర్యాపేట, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : జిల్లాలో గ్రామపంచాయతీకి జరుగుతున్న మూడో విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతముగా ముగిశాయి. జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల,పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి, చింతలపాలెం ఏడు మండలాల్లో ఇప్పటికే 22 గ్రామాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 124 గ్రామపంచాయతీలకు,1118 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
దీనికి గాను 1176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా స్టేజి 1 ఆర్వోలు 45 మంది, స్టేజి 2 147 మంది, 1538 మంది పోలింగ్ ఆఫీసర్ లు, 2026 మంది ఓ పీ ఓ లు విధులను నిర్వహించారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 8 గంటల నుండి 11 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. తదుపరి చాలా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తక్కువగా కనిపించారు.
కాగా మఠంపల్లి మండలంలోని అల్లిపురం, మఠంపల్లి, చౌటపల్లి గ్రామాలలో ఎన్నికల సరళిని ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి పరిశీలించారు. అలాగే జిల్లా cv కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గరిడేపల్లి మండలం పొనుగోడు, గరిడేపల్లి, నేరేడుచర్ల మండలం దిర్సించర్ల,పాలకీడు మండలం పాలకీడు జడ్పీ హెచ్ ఎస్ , కోమటికుంట, కల్మెట్ తండా, గుండ్లపాడు, రాఘవాపురం ఎంపిపిస్ లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించి సందర్శుకుల ఫారం లో ఆయన వివరాలు నమోదు చేశారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లోని సమస్యత్మక గ్రామాలు, గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు, ఎల్బీనగర్, పొనుగోడు, హుజూర్ నగర్ మండలంలోని వేపల సింగారం గ్రామాలలో ఎన్నికల జరుగుతున్న విధానమును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మొత్తంగా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 89.25 శాతం పోలింగ్. మూడో విడత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 89.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో చింతలపాలెం 90.99, గరిడేపల్లి 88.84, హుజూర్ నగర్ 90.78, మఠంపల్లి 89.91, మేళ్లచెరువు 86.59, నేరేడుచర్ల 88.10, పాలకవీడు 90.21 శాతంగా వదిలినట్లు అధికారులు ప్రకటించారు.