18-12-2025 12:18:06 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్17: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహా క్షేత్రాన్ని బుధవారం హైదరాబాదులోని నాచారానికి చెందిన శ్రీ మహంకాళి సహిత మహంకాళేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మెతుకు శ్రీనివాస్ రెడ్డి,ఆలయ ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను తెలుసుకొని యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ సమీపంలోని కార్యసిద్ధి వీర హనుమాన్,శ్రీరామకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, నిర్వాహకులు గణపురం నరేష్, కసనబోయిన సత్యనారాయణ,అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.