31 March, 2026 | 1:59 AM

బీసీల చైతన్యం విజయాలకు నాంది

31-03-2026 12:00 AM

టి.చిరంజీవులు :

గతంలో చట్టసభల్లో బీసీ అంశా లు ఈ స్థాయిలో వినిపించేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. బీసీలు కేవలం ఓటర్లుగానే కాకుండా, పాలసీని ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతున్నారు. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న బీసీ ఉద్యమ చైతన్యం, సంఘటిత కృషి దీనికి పునాది. బీసీలు తమ సంఖ్యా బలం, ఆర్థిక రంగంలో తమ వాటా, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని గుర్తించుకుంటూ ‘మాకు హక్కులు కావాలి’ అనే దశ నుంచి ‘మాకు అధికారం కావాలి’ అనే స్థాయికి చేరుకున్నారు. 

తెలంగాణ రాజకీయ, సామాజిక చరిత్ర ఒక కొత్త అధ్యాయం లిఖించింది. అది ‘బీసీ వాదం’ అనే ఆలోచన తాలూకు విస్తరణ. ఒకప్పుడు కొన్ని వేదికలకే పరిమితమైన ఈ స్వరం నేడు గ్రామసభల నుంచి రాష్ట్ర చట్టసభల వర కు, విద్యార్థి సంఘాల నుంచి న్యాయవాదుల వేదికల వరకు విస్తరించడం విశేషం. ఇది కేవలం నినాదం కాదు --- సామాజిక చైత న్యం, రాజకీయ దిశ, ఆత్మగౌరవ ఉద్యమం. ‘మేమెంతో.. మాకంత’ అనే భావనకు ఇది స్పష్టమైన ప్రతిబింబం.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బీసీల బడ్జెట్ కేటాయింపులపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నలు లేవనెత్తడం ఒక కీలక మార్పు. గతంలో చట్టసభల్లో బీసీ అంశా లు ఈ స్థాయిలో వినిపించేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. బీసీలు కేవలం ఓటర్లుగానే కాకుండా, పాలసీని ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతున్నారు.

ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న బీసీ ఉద్యమ చైతన్యం, సంఘటిత కృషి దీనికి పునాది. బీసీలు తమ సంఖ్యా బలం, ఆర్థిక రంగం లో తమ వాటా, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని గుర్తించుకుంటూ ‘మాకు హక్కు లు కావాలి’ అనే దశ నుంచి ‘మాకు అధికారం కావాలి’ అనే స్థాయికి చేరుకున్నారు. ఇదే బీసీ వాదం అసలు సారం.

మార్పు మొదలు

ఇటీవల గ్రామీణ స్థాయిలో జరిగిన సర్పంచ్, పట్టణ స్థాయిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున గెలవ డం ఈ మార్పుకు ప్రాథమిక సంకేతం. ఇది కేవలం స్థానిక సంస్థల విజయం కాదు --- గ్రాస్‌దీతిజిజిరూట్ స్థాయిలో నాయకత్వ మార్పు. ఈ నాయకత్వం రేపటి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఇదే మార్పు ఇప్పుడు న్యాయవాదుల వేదికలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ ంగా అడ్వకేట్ వృత్తిని ఒక ఎలైట్ స్పేస్ గా భావిస్తారు.

కానీ ఈసారి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23 సీట్లలో 9 మంది బీసీలు (ఇద్దరు ముస్లిం బీసీలను కలుపుకొని) గెలవడం ఒక మైలురాయి. బార్ అసోసియేష న్లలో సుమారు 60 శాతం వరకు బీసీలు గెలవటం జరిగింది. మరింత ఆసక్తికరమైన విషయం ---గతంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితాలు తేలేవి. కానీ, ఈసారి ఎన్నికల్లో బీసీల తీవ్రమైన పోటీ కారణంగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కిం పు వరకు వెళ్లడం జరిగింది.

ఇది బీసీ అభ్యర్థుల పోటీ శక్తి, రాజకీయ అవగాహన పెరుగుదలకి నిదర్శనం. ఈ విజయాల వెనుక  బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ నాయకత్వం ముఖ్యంగా టి.రాజు, పొన్నం దేవరాజు కృషి, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం వంటి వేదికల కృషి కూడా ఉంది.

వృత్తిపరమైన రంగాలకూ విస్తరణ

బీసీ వాదం ఇప్పుడు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు --- ఇది ప్రొఫెషనల్ రంగాల్లోకి కూడా విస్తరించింది. రెండ వది, ఇది కేవలం కుల ఐడెంటిటీ కాదు  ఇది ఒక సామాజిక సమీకరణ. మూడవది, ఇది భవిష్యత్తులో పెద్ద రాజకీయ మార్పులకు దారి తీసే సంకేతం. చరిత్ర మనకు ఒక స్పష్టమైన దారిని చూపిస్తుం ది. బీఆర్ అంబేడ్కర్ గారి సామాజిక న్యాయ పోరాటం, కాన్సి రామ్ గారి బహుజన రాజకీయాలు --- ఇవి ఒక సూత్రాన్ని చెబుతాయి. సంఖ్యా బలం ? చైతన్యం ? సంఘటితం ? రాజకీయ అధికారం.

తెలంగాణలో ఈ ప్రక్రియ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, న్యాయవృత్తి, స్థానిక పాలన --- అన్ని రంగా ల్లో బీసీలు తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. ఈ విస్తరణకు మూల కారణం బీసీ ఉద్యమ సైద్ధాంతిక పునాది అదే వాటా (హిస్సా), ఆత్మగౌరవం (ఇజ్జత్), అధికారము (హుకుమత్). ఇప్పటి బీసీ యువత అవకాశాల కోసం ఎదురు చూడ డం లేదు. వారు అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ‘మాకు ఇవ్వండి’ అనే దశ దాటిపోయింది---. ‘మేమే సాధించుకుం టాం’ అనే దిశలో అడుగులు వేస్తున్నారు. ఇదే ఈ ఉద్యమానికి శక్తి. 

ప్రధానమైన సవాళ్లు 

బీసీల ఉద్యమంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రధానమైనవి అంతర్గత విభజనలు. ఉపకులాల మధ్య పోటీ, రాజకీయ పార్టీల ద్వారా కో- స్పష్టమైన ఐడియాలజీ లోపం. ఈ సవాళ్లను అధిగమిం చకపోతే, ఉద్యమం బలహీనపడే ప్రమా దం ఉంది. ముఖ్యంగా ‘బీసీలకు బీసీలే శత్రువులు’ అనే విమర్శను చెదరగొట్టాలంటే, ఐక్యత అత్యవసరం. ఐక్యత లేకుం డా సంఖ్యా బలం ప్రయోజనం ఇవ్వదు. అలాగే, బీసీ వాదం కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకూడదు.

ఇది ఒక సమగ్ర సామాజిక ఉద్యమంగా మారాలి. విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవం --- ఇవన్నీ ఇందులో భాగం కావాలి. అప్పుడు మాత్రమే ఇది దీర్ఘకాలిక మార్పుకు దారి తీస్తుంది. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగితే, వారు కేవలం “కింగ్ మేకర్స్‌” కాకుండా, ‘కింగ్స్’గా మారగలరు.--- అంటే ఇతరులను గెలిపించే స్థాయి నుంచి, తామే అధికారాన్ని సాధించే స్థాయికి చేరుకుంటారు. 

ముగింపుగా చెప్పాలంటే, బార్ కౌన్సి ల్, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కనిపించిన బీసీల హవా ఒక సాధారణ సంఘట న కాదు. ఇది ఒక లోతైన సామాజిక మార్పు యొక్క సంకేతం. ఈ మార్పు కొనసాగితే --- బీసీలు అన్ని రంగాల్లో నాయక త్వాన్ని స్వీకరిస్తారు. చివరికి రాజ్యాధికారాన్ని సాధించే దిశగా పయనిస్తారు ఇది ఒక ఆశ కాదు.. ఇది రూపుదిద్దుకుంటున్న వాస్తవం.

వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్