03-07-2025 12:00:00 AM
కల్వకుర్తి జూలై 2: ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశ్యంతో దాతలు తమ స్వంత ఖ ర్చుతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లు, ఇప్పుడు రోడ్డుపక్కన వృధాగా పడి ఉన్నాయి. కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ భారీ పెరిగిన నేపథ్యంలో కొంతమంది దాతలు భారీ కేట్లను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల క్రితం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతు ల మీదుగా పోలీస్ శాఖ సమక్షంలోనే ఈ భారీ కేట్లను వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేశారు.
కానీ వాటిని సరైన విధంగా వినియోగించకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పోలీస్ అధి కారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత నెలలో వెల్దండ మండల పరిధిలోని ఎన్నం హాస్పిటల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందడం, అంతకు ముందు పసిపాపతో సహా తండ్రి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
కల్వకుర్తి పట్టణ సమీపంలో కారు బైక్ ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం మరొకరి పరిస్థితి విషమంగా మారడం ఇలా వారం రోజుల్లోనే మూడు కుటుంబాల పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. వేగ నియంత్రనకు వినియో గించేబారికేడ్లు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పక్కకు పడిపోయి, చెట్ల పొదల్లో సేద తీరుతున్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి దాతలు ఇచ్చిన భారీ కేట్లను సరైన పద్ధతిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రధాన రహదారుల వెంట వేగ నియంత్రణ చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.