calender_icon.png 5 July, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ

03-07-2025 12:00:00 AM

50 మందికి రూ. 11.24లక్షల చెక్కులు అందజేత

ఖమ్మం, జూలై 2 (విజయ క్రాంతి):ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు తన సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి(సీ ఎంఆర్ ఎఫ్) చెక్కులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం గట్టయ్య సెంటర్ లో గల క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి పంపిణీ చేశారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 50 మందికి రూ.11.24 లక్షల మేరకు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ వేగంగా చెక్కులు మంజూరు చేస్తోందని చెప్పారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు తన సిఫారసుతో అర్హులైన 1100మంది పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, పదుల సంఖ్యలో ఎల్‌ఓసీ పత్రాలు మంజూరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు.