03-07-2025 12:00:00 AM
- డాక్టర్స్ డే రోజు ఘటన
- వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న బాధితులు
- వైద్య సిబ్బందిపై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 2 (విజయ క్రాంతి); కలెక్టర్ సతీమణి ప్రసవించిన ప్ర భుత్వ ఆసుపత్రిగా పేరు అందిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పం డంటి బిడ్డను కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసు పత్రిలో డాక్టర్స్ డే రోజు ఈ సంఘటన చో టుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మందిరం పాడు గ్రామానికి చెం దిన కోరం కరుణ మంగళవారం ఉదయం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు.
మ ధ్యాహ్నం 12 గంటల వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యుల ప్రయత్నం చేశారు. ఆపరేషన్ చేసి బిడ్డల బయటకి తీయని ఎంత వేడుకు న్నా వైద్యులు ససేమిరా అన్నారు. ఈలోగా కడుపులోనే పుష్షు మరణించడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసి బంధువులు అప్పగించారని బాధితురాలీ బంధువు వజ్రా లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. డాక్టర్ సతీమణి పురుడు పోసుకున్న ఆసుపత్రి అని నమ్మకంతో ఆస్పత్రికి వస్తే బిడ్డను బలి తీసుకున్నా రంటూ తల్లి కరుణ, లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు.
వైద్య సిబ్బంది పై కేసు నమోదు
ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి న గర్భిణీ మహిళ పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదయింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆసుపత్రిలో చేరిన కోరం కరుణను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం వేచి ఉంచడంతో పరిస్థితి విషమించి శిశువు గర్భంలోనే మృతి చెందాది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితురాల భర్త కోరం రాంప్రసాద్ వైద్యులను నిలదీశారు.
దీంతో తాము చేయాల్సింది చేశామని, దురదృష్టవశాత్తు గర్భంలో శిశువు ఉమ్మనీరు మింగటం, పేగు మెడకు చుట్టుకోవడం తో మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చే శారు. ఉదయం 10:30 గంటలకు డాక్టర్ అ నూష తన భార్యను పరీక్షించి అంతా బాగా నే ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి వెళ్లిపోయారని, ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు హాస్పటల్ సిబ్బంది కాలయాపన చేయడం వల్లనే శిశువు గర్భంలో మరణించాడని భర్త ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు అయింది.