calender_icon.png 21 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాంపస్ ఇన్నోవేషన్‌కు నాంది

21-02-2026 01:39:45 AM

  1. ‘క్యాంపస్ ప్రెన్యూర్’తో విద్యార్థుల ఆలోచనలకు వ్యాపార రూపం 
  2. వీ కీలక ముందడుగు

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు అందిస్తున్న వీళు దేశవ్యాప్తంగా క్యాంపస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే దిశగా ‘క్యాంపస్‌ప్రెన్యూర్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని యువతలో ఇన్నోవేషన్, స్టార్టప్ సం స్కతిని పెంపొందించడం లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం 12 వారాలపాటు ఆ లోచన నుంచి ప్రోటోటైప్ దశ వరకు విద్యార్థులకు సమగ్ర శిక్షణ, మెంటారింగ్, ఇండస్ట్రీ పరిచయం, సంస్థాగత మద్దతు అందిస్తుంది.

ఈ కార్యక్రమానికి 112 ఆలోచనలు నమోదుకాగా, వాటిలో 143 మంది విద్యార్థులతో కూడిన 57 ప్రతిభావంతమైన టీమ్‌లను తొ లి కోహోర్ట్‌గా ఎంపిక చేశారు. తెలంగాణలో ని 9 జిల్లాల పరిధిలోని 26 కాలేజీల విద్యార్థులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. అ దేవిధంగా పుణే, నవీ ముంబై నగరాల నుం చి కూడా పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం జాతీయ స్థాయికి విస్తరించింది. ఈ సందర్భంగా వీ హబ్  సీ ఈఓ సీత పల్లచొల్ల మాట్లాడుతూ...

క్యాంపస్‌ప్రెన్యూర్ యువత, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారిగా కాకుండా  సృష్టించే నాయకులుగా ఎదగడానికి వేదికగా నిలుస్తుందన్నారు.నైపుణ్యాలు, మెంటారింగ్, ఎకోసిస్టమ్ మద్దతుతో టియ ర్-2, టియర్-3 ప్రాంతాల్లో  పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడమే  లక్ష్యమన్నారు. మెట్రో నగరాలకు పరిమితం కాకుండా చిన్నపట్టణాలు, గ్రామీణ విద్యార్థుల్లో ఆవిష్కరణ సా మర్థ్యాన్ని వెలికితీయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.