18 July, 2026 | 1:30 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

రాక్షస పాలన మొదలు

31-05-2026 01:44 AM
  1. విద్యుత్ పేరిట రైతులపై భారం వేయొద్దు
  2. మోదీ చెప్పినట్లే రేవంత్ నడుచుకుంటున్నారు
  3. ధాన్యం కొనకుంటే ఎమ్మెల్యేల ఇంట్లో కుమ్మరించాలి
  4. తెలంగాణపై మళ్లీ కన్నేసిన ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్’
  5. ‘బక్క’ మాటలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఖండించరా?
  6. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 

ఎల్లారెడ్డి, మే 30 (విజయక్రాంతి): అధికారం మారిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పచ్చగా ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో నాశనమైపోయిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందజేసేవారమని, ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ, మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ నాయకుల, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు ఒకటైపోయాయని, మోదీ చెప్పినట్లు రేవంత్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మీటర్లు పెట్టాలని ప్రధా ని ఒత్తిడి తెచ్చారని అన్నారు. కానీ దాన్ని కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. ఈఆర్సీ అధికారి శశాంక్‌పై మండిపడ్డారు. విద్యుత్ మీటర్లు పెట్టాలనే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. మూడు గంటల్లో పొలం పారించి చూపించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి సవాల్‌విసిరారు.

ప్రభుత్వం జొన్నలు కొనకపోతే కాంగ్రె స్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కుమ్మరించాలని రైతులకు సూచించారు. రైతులు పండించిన ఏ పంటనైనా కొనాల్సిందేనని లేకుంటే మీ ఇళ్ల ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యూరి యా కావాలంటే మీసేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. 30 శాతం కొనుగోళ్లు జరిగితే సీఎం 80 శాతం అని డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించా రు.  తడిసిన ధాన్యంలో తరుగు తీస్తే ఎకరా పండించిన రైతుకు రూ.9వేల నష్టం వాటిల్లుతుందన్నారు.

రైతుల బాధలు పట్టడం లేదు కానీ, నగరంలోని భూదందాలు తెలుసన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ రైడీయిజానికి దిగుతున్నారని ఆరోపించారు. చంద్రబా బు, పవన్‌కళ్యాణ్ లాంటి ఆంధ్ర నాయకులు తెలంగాణపై మళ్లీ కన్నేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్క నర సింహులు మాటలను అటు చంద్రబాబు, ఇటు రేవంత్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని నిలదీశారు. బీజేపీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వీరందరితో చేతులు కలిపి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.