రాహుల్‌గాంధీని నిలదీయాలి
- నిరుద్యోగులకు హామీలిచ్చి మోసం
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేశారు
- ‘ఎస్‌ఐఆర్’ ఓటర్ల నమోదుపై అప్రమత్తంగా ఉండాలి
- ఏ ఎన్నికల్లోనైనా బీఆర్‌ఎస్ వెంటే హైదరాబాద్ ప్రజలు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి యువతకు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని తెలంగాణ యువతకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగో లు హామీలిచ్చి, వారందరినీ మోసం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఓట్లు వేయించుకొని, గెలిచాక ఇప్పటిదాకా కనీసం మొఖం కూడా చూపించడం లేదన్నా రు.
తెలంగాణ యువతకు మా కాంగ్రెస్ ప్రభు త్వం అన్యాయం చేస్తే తిరిగి వచ్చి అండగా నిలబడతానని అన్న రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని, నిరుద్యోగులను నట్టేట ముంచారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీని ఈ అంశంలో నిలదీయాల ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందే లేదని, కేవలం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపు కుందన్నారు.
రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు చేసిన ద్రోహాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పైన కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్‌ఏలు ప్రతి ఒక్కరి ఓటు తొలగకుండా చూడాలన్నారు. దీనితోపాటు కాంగ్రె స్, బీజేపీ అడ్డగోలుగా డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను రాయించే ప్రమాదం ఉన్నదని.. వీటిని అరికట్టేలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్‌ఎస్ వెంట నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు వంటి నిర్మాణాలు చేస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం ‘హైడ్రా’ పేరిట వేల ఇండ్లను కూల్చుతున్నారన్నారు. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపారు. ఈ సారి పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలో జరిగే ఈ సభ్యత్వానికి సంబంధించి పార్టీ శ్రేణులకు బూత్ వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని కేటీఆర్ చెప్పారు.
విద్యార్థుల పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్
సీబీఎస్‌ఈ మార్కుల గందరగోళ వ్యవహరంపై విద్యార్థుల పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్న వారిని వారు జవాబుదారీగా నిలబెడుతున్న తీరు అభినందనీయమని పేర్కొ న్నారు. గ్లోబరీనాను సీబీఎస్‌ఈ విస్మరించిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలో 2019 ఇంటర్ ఫలితాలను తారుమారు చేసిన గ్లోబరీనా సంస్థ.. తన పేరు మార్చుకుని సీబీఎస్‌ఈ నుంచి కాంట్రాక్టును దక్కించుని అంతకంటే పెద్ద గందరగోళాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ గ్లోబరీనా వ్యవహారంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని, ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులను తొలగించిందని గుర్తుచేశారు.
అదేవిధంగా ఆ సంస్థపై కోర్టులో కేసు వేసిందని తెలిపారు. ఆ సంస్థ చరిత్రను సీబీఎస్‌ఈ విస్మరించిందని, అసమర్థ సంస్థకు అనుకూలంగా ఉండేందుకే సీబీఎస్‌ఈ నిబంధనలను మార్చినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవస్థపై దేశ భవిష్యత్‌ను నిర్మింలేమని సూచించారు.
- ఆటా తెలుగు మహాసభలకు రండి
- కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసిన ఆట ప్రతినిధులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల కేటీఆర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, రాజకీయాలపై చర్చించారు. ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పం దించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయం త్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి బండా పాల్గొన్నారు.






