19 May, 2026 | 2:31 PM

సెయాన్ ప్రారంభం

19-05-2026 12:00 AM

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘సెయాన్’. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. సోమవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఆధ్యాత్మికతతోపాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహి స్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.