వినోదం పంచనున్న సుధీర్ జోకర్
సుడిగాలి సుధీర్ హీరోగా ‘సుధీర్ జోకర్‘ అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. అభిరామి, మురళీశర్మ, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్‌గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
మంగళవారం సుడిగాలి సుధీర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ, ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్లేయింగ్ కార్డ్స్‌తో ఉన్న సుడిగాలి సుధీర్ ఆకట్టుకుంటున్నారు. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అహ్మద్ షెరీఫ్; సంగీతం: లియోన్ జేమ్స్; ప్రొడక్షన్ డిజైన్: విఠల్ కోసనం; ఎడిటిర్: ధర్మేంద్ర కాకర్ల.






