18-11-2025 12:00:00 AM
- భవిష్యత్తు అంతా సోలార్ పవర్ దే..
-ప్రభుత్వ రాయితీతో పాటు బ్యాంక్ లోన్ అవకాశం
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్17 (విజయక్రాంతి) భద్రాద్రిలో ‘సోలార్‘ విప్లవానికి విజేత సోలార్ అండ్ మార్కెటింగ్ సర్వీస్ ఏర్పాటుతో నాంది పలికింది. పిఎం సూ ర్యాఘర్ యోజన పథకం ద్వారా కోటి గృ హాలకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తె లంగాణ, ఏపీ రాష్ట్రాల అధీకృత డీలర్షిప్ కలిగి విజేత సోలార్ సర్వీస్ అధినేత వై.వెంకటేశ్వరరావు సారధ్యంలో,నేడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ప్రాంత ప్రజలకు తన సేవలు అందించేందుకు ముందుకొచ్చింది.
ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్, విజయవాడ, కొదా డ, అమలాపురం ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ బై పాస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సోలార్ సర్వీసు ఆఫీస్ ను కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూ నంనేని సాంబశివరావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజ ల్లో పునరుత్పాదక శక్తి వినియోగంపై అవగాహన పెంచుతూ, పర్యావరణహిత సాంకేతిక పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘విజేత సోలార్ మార్కెటింగ్ సర్వీస్’ కేంద్రం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సో లార్ ఎనర్జీ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ కూడా ఆ దిశగా ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ఇళ్లలో, వ్యవసాయంలో, వ్యాపారాల్లో సో లార్ వినియోగం పెరిగితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా, గ్ప్రి భారం కూడా తగ్గుతుందని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవగాహన ఇంకా పల్లె ప్రా ంతాల్లో అవసరమని చెప్పారు.
ఈ సందర్భంలో విజేత సోలార్ వంటి సంస్థలు మంచి మార్గదర్శకత్వం అందిస్తే ప్రజలకి మరింత మేలు జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి సంస్థ పాత్ర ఉండాలని, సోలార్ ప్యానెల్స్ వినియోగం వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు.విజేత సోలార్ అండ్ మార్కెటింగ్ సర్వీస్ అధినేత వై.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. గృహోపయోగ రూ ఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీలు అందిస్తోందని, అంతేకాకుండా 90శా తం నుండి వంద శాతం వరకు రుణసదుపా యం కూడా ఉందని, అన్నీ సేవలు ఒకేచోట అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సిపిఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, చుంచుపల్లి మండల ఎమ్మార్వో కృష్ణ, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు, విజేత సోలార్ నిర్వాహకులు ప్రసాద్, అశోక్, వెంకటేశ్వర్లు, ప్రేమ్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, పర్యావరణహిత ప్రాజెక్టులపై మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.