18-11-2025 12:00:00 AM
కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మత్స్యశాఖ అధికారి
కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మత్స్యశాఖ అధికారిగా డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశిష్ సన్మానం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇంతకుముందు ఇక్కడ వచ్చేశాక అధికారిగా పనిచేసిన శ్రీపతి వరంగల్ హనుమకొండలకు వర్క్ డిప్యూటేషన్ పై బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డోలీసింగ్ నిజాంసాగర్ లోని మత్స్య విత్తన క్షేత్రంలో విధులు నిర్వహించారు.
ప్రస్తుతం అదే మత్స్య విత్తన క్షేత్రానికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈనెలనికి సంబంధించి మత్స్య శాఖ డైరెక్టర్ డాక్టర్ కే నిఖిల ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని మత్స్యకారులందరికీ ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అన్ని చెరువుల్లో చేప విత్తనాలు వేసే విధంగా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని మత్స్య సహకార సంఘం ప్రతినిధులు, మత్స్యకారులు సహకరించాలని డోలిసింగ్ కోరారు.