calender_icon.png 5 May, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టం

19-04-2025 04:57:33 PM

ఎమ్మెల్యే మందుల సామేలు..

నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ సూర్యాపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని నాగారం మండల కేంద్రంలో పనిగిరి గ్రామంలో ఆనంద్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel) సదస్సుకు హాజరై మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్నతీసుకువచ్చినది అని అన్నారు. వివాదాలు లేని నియోజకవర్గంగా తుంగతుర్తి నియోజకవర్గాన్నితీర్చిదిద్దేందుకుభూ భారతి చట్టంఉపయోగపడుతుందన్నారు.

తమ ప్రభుత్వం 100 సంవత్సరాలు చెప్పుకునేలా  ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. రైతులకు మేలు జరిగేలా భూ వివాదాలు లేని చట్టంగా ప్రభుత్వం ఈ చట్టాన్నితీసుకువచ్చిందన్నారు భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆకాశము లేదని ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత చట్టాన్ని తీసుకురావడం జరిగిందని జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుందన్నారు.

అంతేకాక  ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన గ్రామ పరిపాలన రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసే విధంగా పదివేల మంది గ్రామ పాలనాఅధికారులనునియమించనున్నామని, దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, సన్న బియ్యం పంపిణీ, వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని,వీటన్నిటిని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్ష్మాపురంలో నూతనంగా అంగడిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి తాసిల్దారు బ్రహ్మయ్య, ఎంపీడీవో మారయ్య డిప్యూటీ తాసిల్దార్ షాహిని బేగం పిఎసిఎస్చైర్మన్ చంద్రశేఖర్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి బుచ్చిబాబు, తుడుసు లింగయ్య పసుపులేటి వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి పాశం యాదవ రెడ్డి రమేష్ చంద్ర, భయం వెంకన్న అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.