calender_icon.png 24 October, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్లాం నుంచే సనాతన ధర్మానికి అతిపెద్దదెబ్బ

23-10-2025 01:13:27 AM

-ఈ కోణం చరిత్రలో విస్మరించారు 

-‘వికసిత్ భారత్’పై ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి సారించాలి

-యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

గోరఖ్‌పూర్, అక్టోబర్ 22: ఇస్లాం నుంచే సనాతన ధర్మానికి అతిపెద్ద దెబ్బ తగిలిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మానికి ఎదురైన చారిత్రక సవాళ్లపై ఆయన బుధవారం సంచలన వ్యా ఖ్యలు చేశారు. ‘వికసిత్ భారత్’పై ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి సారించాలని యోగిఆదిత్యనాథ్ కోరారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘విచార్-పరివార్ కుటుంబ స్నేహ మిలన్’, ‘దీపో త్సవ్ సే రాష్ట్రోత్సవ్’ కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ, భారత చరిత్రలో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసవాదం గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు కానీ, సనాతన ధర్మానికి ‘అతిపెద్ద దెబ్బ’ తగిలింది మాత్రం ‘రాజకీయ ఇస్లాం‘ వల్లనే అని, ఈ అంశాన్ని చరిత్రలో పట్టించుకోకుండా వదిలేశారని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా వం టి వీరులు ఈ ‘రాజకీయ ఇస్లాం‘కు వ్యతిరేకంగానే పోరాడారని ఆయన గుర్తుచేశారు. మన పూర్వీకులు ఈ అంశంపై ప్రధాన పో రాటాలు చేసినా, ఈ చారిత్రక కోణం విస్మరించబడిందని యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

 అలాగే, అయోధ్యలో రామమందిర ని ర్మాణం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ చూపిన ‘అచెంచలమైన నిబద్ధత’ను యోగి ఆదిత్యనాథ్ ప్ర శంసించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి వంటి రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆర్‌ఎస్‌ఎస్ వె నుకడుగు వేయలేదని, అనేక ఆంక్షలు, లాఠీచార్జీలు, తుపాకీ కాల్పులను తట్టుకుని నిల బడడం వల్లే నేడు రామ మందిరం రూపుదిద్దుకుందని అన్నారు. ‘రాజకీయ ఇస్లాంను ప్రోత్సహించే కార్యకలాపాలైన మత మార్పిడులు, లవ్ జిహాద్, ఉగ్రవాదం’ వంటి రూ పాల్లో ఇంకా కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే, హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాన్ని ఉత్తరప్రదేశ్ ప్ర భుత్వం నిషేధించిందని, హలాల్ ఆదాయాన్ని మత మార్పిడి, ఉగ్రవాద కార్యకలా పాలకు ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఒక ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మాణానికి ఆర్ ఎస్‌ఎస్ దృష్టి సారించాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలను (సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ వస్తువుల ద్వారా స్వావలంబన, పౌర బాధ్యత) ఆయన వివరించారు. అభివృద్ధి చెందిన సమాజం, దేశం కోసం ప్రభుత్వం కంటే సమాజమే ముందుండి నడిపించాలని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.