calender_icon.png 24 October, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం!

23-10-2025 01:11:46 AM

-అడ్డంకులేమీ లేవు

-ఆయన తమ దేశ పౌరుడు కాదన్న బెల్జియం కోర్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆర్థిక నేరగాడు, పంజాబ్ నేషన్ బ్యాంక్(పీఎన్‌బీ)కి వేల కోట్లు ఎగవేసి, పారిపోయిన వ్యాపార వేత్త మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తామని, అండ్డంకులేమీ లేవని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది. చోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తుచేసిన కోర్టు, ఆయన చేస్తున్న కిడ్నాప్ వాదనలనూ తోసిపుచ్చింది. మెహుల్ చోక్సీ ని అప్పగించేందుకు ఇటీవల బెల్జియం న్యా యస్థానం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

రాజకీయ ప్రేరేపణలతోనే తన అప్ప గింతకు ఆమోదం లభించిందని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా బెల్జియం యాంట్వెర్ప్ నాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తుచేస్తూ... అప్పగింతను సమర్థించే తీవ్రమైన అభియోగాలు అతడు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. చోక్సీపై భారత్ చేసిన అభియోగాలను బెల్జియం చట్టప్రకారం కూ డా నేరాలుగానే పరిగణిస్తామని పేర్కొంది. భారత్ ఆదేశాల మేరకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ చాలా కాలంగా చోక్సీ చేస్తున్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొంది.