calender_icon.png 23 October, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఛా వీసాలపై వాల్‌మార్ట్ కీలక నిర్ణయం

23-10-2025 01:15:11 AM

-అభ్యర్థుల నియామయాలు నిలిపివేయాలని నిర్ణయం

-ట్రంప్ హెచ్ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడమే కారణం

వాషింగ్టన్, అక్టోబర్ 22: హెచ్ వీసా అభ్యర్థుల నియామకాలు నిలిపివేయాలని అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కీలక నిర్ణయం తీసుకుందని అక్కడి బ్లుమ్‌బర్గ్ పేర్కొంది. హెచ్‌ఠ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ కం పెనీలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోం ది. దీంతో హెచ్ వీసా అభ్యర్థులను ని యమించుకునే విషయంలో అక్కడి పేరొందిన కంపెనీలు సైతం వెనుకడుగు వేస్తున్నా యని తెలుస్తోంది.

కాగా, వాల్‌మార్ట్‌లో ప్ర స్తుతం 2వేల మంది కంటే ఎక్కువ మంది హెచ్ వీసా హోల్డర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. హెచ్ వీసా అ భ్యర్థుల నియామకాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని.. ఈ క్రమంలో కస్టమర్లకు ఉత్త మ సేవలు అందించేందుకు ప్రతిభావంతులను నియమించుకునేందుకు కట్టుబడి ఉ న్నామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

నేరుగా దరఖాస్తు చేసుకునే వారికే..

అమెరికాలో ఉండి వీసా స్టేటస్‌ను మా ర్చుకునే వారికి, ఇప్పటికే హెచ్ 1బీ వీసా ఉండి.. కొనసాగింపు కోరే వారికి ఈ లక్ష డా లర్ల ఫీజు వర్తించదని అమెరికా తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, విదేశాల నుంచి నేరుగా హెచ్ వీసాలకు ద రఖాస్తు చేసుకునే వారు మాత్రమే ఈ మొ త్తం చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి.