2 June, 2026 | 2:43 AM

స్వరాష్ట్ర జననం

02-06-2026 12:00 AM

తెలంగాణ ఆవిర్భావ దినం

తెలుసుకోండి అంతర్భావం జనం

కలసిరండి తెలంగాణ జనం

ఎందరెందరిదో ప్రాణ త్యాగం


నేడు తెలంగాణ రాష్ట్ర జననం

చూడు తెలంగాణ ప్రజా జీవనం

అన్నిటిలో రావాలి అభివృద్ధి తోరణం

అందరికి కావాలి ఉద్యోగ తరుణం


తెలంగాణ ఆకలికేకల గానంపై

అమరవీరులు చేసిరి బలిదానం

అనేకులు చేసిరి శ్రమదానం

అధికార్లకుండాలి అభివృద్ధిపై ధ్యానం


బానిసపు ఉరులు తపించను

బంగారపు సిరులు అందించను

బాధతత్వపు దారులు భరించి

బలిదానమైన శూరులను 

తరించుకుందాం


తెలంగాణ 

చిత్రపటం కోసం

తెలంగాణ 

చరిత్ర పాఠం కోసం

పోరాటం చేసిరి 

ఎందరో ప్రజలు

ఆరాటపడినారు ఎందరో జనులు

డా.బాబురావు పెండాల 

9573747016