25 March, 2026 | 2:51 AM

సమస్యల చితిమంటలు..!

25-03-2026 01:31 AM
  1. స్మశాన వాటికపై నిర్లక్ష్యం 

అసంపూర్ణంగా నిర్మాణ పనులు

స్నానపు గదులు కరువు.. మరుగుదొడ్లు కానరావు...

నీటి సదుపాయం మృగ్యమే...

ప్రేక్షకులుగా పురపాలకులు

బెల్లంపల్లి, మార్చి 24 : స్మశాన వైరాగ్యం అంటే ఇదేనేమో.. !? బెల్లంపల్లి పోచమ్మ స్మశానవాటికలో సమస్యల చితిమంటలు ఆరడం లేదు. కనీస సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతిమక్రియల అనంతరం స్నానం చేసే సదుపాయం కూడా లేదు... కూత వేటు దూరంలో చెరువు ఉంది. కానీ అక్కడ స్నానాలు చేసే సదుపాయం మృగ్యం. మునిసిపల్ నుంచి వాటర్ ట్యాంకర్ సదుపాయం అందరికీ అందుబాటులో ఉం డదు. దీంతో అంతిమ యాత్ర ముగిసిన తర్వాత ప్రజలు స్నానాలు కోసం ఇబ్బందులు పడక తప్పడం లేదు.

అంత్యక్రియలకు వెళ్లిన వారు అక్కడే స్నానాలు చేసి తిరిగి ఇంటికివెళ్లడం అనవాయితీ. కాగా అలాంటి సదుపా యం బెల్లంపల్లి స్మశాన వాటికలో మచ్చుకు కనిపించకపోవడంతో స్నానాలు చేయకుండా నే ఇంటికి వెళ్లడం ఒక బెల్లంపల్లిలోనే చూస్తున్నామని పలువురు వాపోతున్నారు.

శ్మశాన వాటికలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం యావత్తు ప్రజాప్రతినిధులు, పాలక వర్గాలు సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చేసేదే మి లేక ప్రజలు తమ భాదలను తామే భరిస్తున్నామని, బంధువులుపోయిన బాధలో ఉన్న వారికి అంత్యక్రియల అనంతరం స్నానం చేసే సౌకర్యం కల్పించలేని పాలకులపై తిట్లపురా ణం వెదజల్లుతున్నా వారిలో ఛలనం కల్గడం లేదాయే... 

అరకొరగా అభివృద్ధి పనులు..

బెల్లంపల్లి పోచమ్మ స్మశాన వాటిక అభివృ ద్ధి నిర్మాణ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాం (2018)లో స్మశాన వాటికల అభివృద్ధికి తొలి బీజం పడింది. సుమారు కోటి రూపాయలతో స్మశానవాటికలో స్నానపు గదులు, విశ్రాంతిగ దులు, మరుగుదొడ్లు, రహదారులతో పాటు రెండు బర్నింగ్ ఫ్లాటు ఫామ్ ల నిర్మాణం తదితర సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టారు.

ఇలా భారీఎత్తున నిధులతో చేపట్టిన స్మశాన వాటిక అభివృద్ధి పనులు కొలిక్కిరాకుండా నే ఆగిపోయాయి. శ్మశానం చు ట్టూ ప్రహరీ గోడ మాత్రమే పూర్తి చేశారు తప్ప ఉండాల్సిన  కనీస, మౌలిక సదుపాయాలేవీ కనిపించవు. అన్నింటిని అరకొరగా నిర్మాణ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. ఇలా జరిగితే అదికారులు ఏమీ చేశారనే ప్రశ్నలు వ్యక్తముతున్నాయి. అధికారుల పని తీరులో పూర్తి లోపభూయిష్టత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

మంచిర్యాల, మందమర్రి ఇతర  ప్రాంతాల్లో స్మశాన వాటికలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇక్కడి పాలకుల పుణ్యమాని బెల్లంపల్లిలో మాత్రం స్మశాన వాటికల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందం గా ఉండిపోయింది. స్మశాన వాటికలో కనీసం రోడ్డు సదుపాయం కూడాలేక పార్ధీవదే హాన్ని శ్మశానంలోకి తీసుకెళ్లడం ఎంతో కష్టంగా మారింది. పారిశుధ్యం పూర్తిగా లోపించింది. పిచ్చి చెట్లు పెరిగిపోయి అస్తవ్యస్తంగా తయారైంది. వర్షాకాలంలో స్మశాన వాటిక బురదమయంగా మారి కనీసం నడవలేని దుస్థితి... కొన్నేళ్లుగా ఈ దుస్థితినే ప్రజలు ఎదుర్కొంటున్నా పాలకుల్లో కదలిక రావడం లేదు... 

రూ. 10 లక్షలు నేలపాలు..?

స్మశాన వాటికలో లక్షల రూపాయలు వెచ్చించి గ్యాస్ క్రిమిటేషన్ ఏర్పాటుకు సంకల్పించారు. మహానగరాల్లో మాదిరిగా శవాలను బర్న్ చేయడం కోసం గ్యాస్ క్రిమిటేషన్ ఏర్పాటు  కోసం ప్రత్యేకంగా రూ. 10 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టిన నిర్మాణాపనులు పూర్తి కాకుండానే నిలిచిపోయా యి. కేవలం గ్యాస్ క్రిమిటేషన్ గది, అందుకు సంబంధించిన అరకొర నిర్మాణ పనులు మాత్రమే  చేసి చేతులు దులిపేసుకున్నారు.

దీంతో నిరుపయోగంగా మారింది. ఇప్పటి వరకు నెలకొల్పిన అరకొర సముదాయాలు ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఇదంతా అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తే దారుల అవినీతి వెరసి ఈ పరిస్థితి గోచరించిందన్న విమర్శలున్నాయి. శవాల బర్నింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన రూ. 10  లక్షలు నేలపాలయ్యాయి.

ఆగిపోయిన స్మశాన వాటిక అభివృద్ధి పనులను పూర్తి చేద్దామన్న శ్రద్ధాశక్తులు ప్రస్తుత పాలకుల్లో ఏ కోశాన కనిపిం చడం లేదు. ఈ నేపథ్యంలో గత పాలకులకు ఎందులోనూ తీసిపోకుండా కనిపిస్తున్నారన్న విమర్శలు వారిపై వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి స్మశాన వాటికలో పెండింగ్ పనులను పూర్తి చేసి, మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నేటి పుర పురపాలకులపై ఉందనే విషయాన్ని వారు ఇకనైనా గుర్తించాలి.